Karnataka-BJP-Electionsకర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మోడీ, అమిత్ షా పేరు ఎంత బాగా వినిపించిందో, అప్పటివరకు పెద్దగా ఎవరికీ తెలియని గవర్నర్ పేరు వజుభై వాలా అని అందరికీ తెలిసి వచ్చింది. ప్రస్తుతం దేశంలో జరుగుతోన్న ట్రెండ్ ప్రకారం… గవర్నర్లు కూడా రాజకీయాలలో కీలక పాత్రలు పోషిస్తుండడంతో, తనకు వచ్చిన అవకాశాన్ని వాలా కూడా దిగ్విజయంగా పూర్తి చేసారు.

ఓ పక్కన కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు అప్పాయింట్మెంట్ ఇవ్వకుండా రాజకీయం నడిపిన గవర్నర్, ఫైనల్ గా యడ్యూరప్పకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆహ్వానించారు. అంతేకాదు 15 రోజుల లోపు అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాలని కోరారు. అంటే కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను లాక్కోవడానికి హీనపక్షంగా ఓ 15 రోజుల గడువు దొరికిందన్న మాట.

ఇదంతా మోడీ అండ్ అమిత్ షా కనుసన్నల్లో నడిచిన కధ అని రాజకీయ విజ్ఞులకు తెలియనిది కాదు. కేంద్రంలో ఉన్న అధికారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్ ను బిజెపి మించిపోతోందని చెప్పడానికి ఇంతకుమించిన నిదర్శన మరొకటి అవసరం లేదేమో! ఫుల్ మెజారిటీ ఉందన్న వారిని వదిలేసి, బలం లేని వారికి అవకాశం ఇచ్చి బలనిరూపణ చేయాలని చెప్పడం రాజ్యాంగం చెప్తోంది మరి! గతంలో గోవాలో జరిగినవి మాత్రం అడగకూడదు… ష్ గప్ చుప్..!