BJP JanaSena Alliance rumoursజనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డాని కలిశారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. అలాగే బీజేపీ తరపున జాతీయ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్, కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య కూడా ఉన్నారు.

స్థానిక ఎన్నికల సమయానికి జనసేన, బీజేపీ మధ్య పొత్తు విషయంగా చర్చలు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే అమరావతి తరలింపు విషయాన్నీ కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారని సమాచారం. హోమ్ మంత్రి అమిత్‌ షా మధ్యప్రదేశ్‌ పర్యటనతోపాటు దిల్లీ ఎన్నికల హడావుడిలో ఉన్నారు.

మరోవైపు దిల్లీ అభ్యర్థుల ఎంపికపై కోర్‌ కమిటీ సమావేశంలో బిజీగా ఉన్నారు. దానితో ఆయన్ని కలవడం కుదరలేదట. మరోవైపు నిన్న పవన్ కళ్యాణ్ కొందరు ఆరెస్సెస్‌ నేతలను కలిసారని కూడా వార్తలు వస్తున్నాయి. నడ్డాతో భేటీ తర్వాత పవన్‌ కళ్యాణ్ ఏపీకి తిరుగు పయనమయ్యారు.

అక్కడ నుండి సరాసరి కాకినాడకు చేరుకోనున్న జనాసేనాని. నిన్న కాకినాడలో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన దాడిలో గాయపడిన జనసైనికులను ఆయన పరామర్శించనున్నారు. దాడి చేసిన వారి మీద కాకుండా బాధితుల మీద కేసులు ఏంటి అని ఆయన స్థానిక పోలీసులను నిలదీసే అవకాశం ఉంది.