BJP-government Funds to polavaram Projectఆంధ్ర ప్రదేశ్ కి చేసినంత సాయం మరే రాష్ట్రానికి కేంద్రం చేయలేదని బిజెపి చెబుతూ వస్తుంది. కేంద్రం ఇచ్చిన ప్రతి పైసాకు రాష్ట్రం లెక్కలు చేప్పాల్సిందేనని, అయితే రాష్ట్రం సరిగ్గా లెక్కలు చెప్పకపోవడం వల్ల మరిన్ని నిధులు ఇవ్వడానికి అడ్డంకిగా మారిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ విమర్శలు కేవలం బీజేపీ నాయకులు చేస్తున్నారే గానీ కేంద్రం నుండి అధికారికంగా అలాంటి ఆరోపణ లేదు. విజయ సాయి రెడ్డి వంటి వారు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి పార్లమెంట్ లో దీని గురించి ప్రస్తావించినా కేంద్ర మంత్రులెవరూ దానిని ధ్రువీకరించలేదు.

పోలవరం వంటి వాటికైతే బిల్లులు పెడితేనే డబ్బులు ఇస్తున్నారు. పెట్టిన బిల్లులే పెండింగ్ లో ఉన్నాయి అంటే ఇంక అవినీతి ఆరోపణలు ఏంటో? పోనీ గంపగుత్తుగా మేము నిధులు ఇచ్చేశాం లెక్క చెప్పట్లేదు అంటే అది వేరే కథ. అయితే ఇవన్నీ రాజకీయ విమర్శలు అనే అనుకోవాలి. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చెయ్యాలి.

లెక్కలు అడిగితే కేంద్రం అడగాలి దానికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిజంగా అవినీతి ఉందని కేంద్రం నమ్మితే సీబీఐ, ఈడీ వంటివి ఉండనే ఉన్నవి. ఇలాంటి పసలేని ఆరోపణలు రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి చేస్తే వాటిని ప్రజలు హర్షించరు. ఈ విషయం మన రాష్ట్ర బీజేపీ నాయకులు ఎంత గమ్ముని గుర్తిస్తే అంత మంచిది.