BJP follows janasena tirupathi by-electionతిరుపతి ఉపఎన్నికలలో పవన్ కళ్యాణ్ సామాజిక ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి చాలా తిప్పలు పడుతుంది బీజేపీ. గతంలో అలయన్స్ లో తాము చెప్పినట్టుగానే జరగాలి అన్నట్టు బిహేవ్ చేసిన ఆ పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ జనసేన ను ప్రసన్నం చేసుకోవడం మొదలుపెట్టింది.

ఇందుకు కొనసాగింపుగా మొట్టమొదటి సారి జనసేనను ఫాలో అయ్యింది. ఎపి ఎన్నికల కమిషనర్ నీలం సహానీ ఎన్నికల నిర్వహణకు సంబందించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అఖిల పక్ష సమావేశానికి ముందే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ఇప్పుడు మాట్లాడేది ఏముందని జనసేన ఈ సమావేశాన్ని బహిష్కరించింది.

తాము ఎన్నికల నోటిపికేషన్ కొత్తగా ఇవ్వాలని కోరుతూ కోర్టులో కేసు వేశామని, అది తేలకుండానే నోటిఫికేషన్ ఇవ్వడమేంటని కూడా ప్రశ్నించారు. బీజేపీ పార్టీ నేత ఒకరు అఖిలపక్ష సమావేశానికి బయల్దేరారు. కాని మధ్యలో పవన్ కళ్యాణ్ నిర్ణయం రావడంతో ఆయన హాజరు కాలేదని చెబుతున్నారు.

పవన్ కల్యాణ్ తో ఇబ్బంది రాకుండా ఉండడం కోసం బిజెపి కూడా సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించి దానిని ఆచరణలో పెట్టింది. మొట్టమొదటి సారి తాము చెప్పింది బీజేపీ ఫాలో అవుతుందని జనసైనికులు సంబరపడుతున్నారు. అదే సమయంలో ఎన్నికల తరువాత కూడా ఇది కొనసాగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.