జనసేన – బీజేపీ పొత్తుల గురించి సోము వీర్రాజు పొంతనలేని ప్రకటనలు చేస్తుంటారు. 2024 ఎన్నికల బరిలో రెండు పార్టీలు కలిసి పోటీచేస్తామని గతంలో చెప్పిన సోము., ప్రస్తుతం బీజేపీ అన్ని నియోజకవర్గాలలో ఒంటరిగా అయినా పోటీకి సిద్ధమన్నారు. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే బీజేపీ జనసేనకు షాక్ ఇచ్చింది.
గత కొంత కాలంగా మోదీ విధానాలు నచ్చి బీజేపీ పార్టీలో చేరాలనుకుంటున్నాను అని సన్నిహితుల వద్ద చెప్పిన శ్రీకాకుళం జనసేన నేత రాఘవయ్య ఎట్టకేలకు కాషాయం కండువా కప్పుకున్నారు.పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా రాఘవయ్యకు కట్టబెట్టారు జనసేనాని. రాష్ట్రంలో “నోటా” కంటే తక్కువ ఓట్ బ్యాంకు ఉన్న బీజేపీలో చేరికలకు జనసేన నేత ఆసక్తి చూపడానికి కారణమేమిటో అంటూ తలలు పట్టుకుంటున్నారు కార్యకర్తలు.
ఆంధ్రప్రదేశ్ లో జనసేన -బీజేపీ పార్టీలు రాజకీయంగా పొత్తులో ఉన్నాయి. పలు కార్యక్రమాలకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తాము అని పురందరేశ్వరి నిన్ననే ప్రకటించారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కూడా బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పడంతో, బీజేపీ రాష్ట్ర నాయకులతో కాకపోయినా కేంద్ర పెద్దలతో పవన్ ‘టచ్’ లో ఉన్నారనే భావన జనసేన నాయకులకు కలిగింది.
పవన్’ రైతు భరోసా’ కార్యక్రమానికి శ్రీకారం చుడితే ‘బీజేపీ రూట్ మ్యాప్’.., వచ్చిందేమో అని జనసేన కార్యకర్తలు ఉత్సాహంలో మునిగిపోయారు. ఇటువంటి పరిస్థితులలో మిత్ర ధర్మం పాటించాల్సిన బీజేపీ, జనసేన నాయకులకు కాషాయం కండువా కప్పడం జసైనికులకు మింగుడుపడడంలేదు.
“పొత్తులు – పొత్తులు” అని ఇరుపార్టీల నేతలు చెప్పడమే కానీ ఆచారణ లో మాత్రం “పొత్తు పొడవలేదనే” సత్యాన్ని జనసేన అధినాయకుడు గ్రహించాలి. రాష్ట్రంలో బీజేపీ “ద్వంద్వ సిద్ధాంతంతో” ముందుకెళ్తుంది అనడానికి నిలువెత్తు సాక్షమే ఈ ‘చేరికలు’.
You’re Good for Only Exposing: Actress Responds
Ratings: ABN Continues To Be Ahead Of Sakshi