BJP demans JanaSena 2024 electionsతమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. పొరుగున ఉన్న తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న వాటికి సంబంధించిన ఫలితాలు వెల్లడవుతాయి. జయలలిత మరణం అనంతరం ఏఐఏడీఎంకే పార్టీని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుని ఆడిస్తుంది బీజేపీ. దానితో షెడ్యూల్ వెలువడగానే పొత్తు చర్చలు మొదలయ్యాయి.

234 నియోజకవర్గాలు ఉన్న తమిళనాడు లో బీజేపీ తమకు 50 సీట్లు కేటాయించామని పట్టుబడుతుందంట. అయితే పాతిక సీట్ల కంటే ఎక్కువ ఇస్తే అవి పువ్వుల్లో పెట్టి డీఎంకేకి ఇచ్చినట్టే అని అధికార పక్షం అభిప్రాయపడుతోంది. స్వతహాగా బీజేపీకి తమిళనాడులో పట్టు లేదు. అక్కడి ప్రజలు ఉత్తరాది పార్టీలంటేనే ఆమడ దూరంలో ఉంటారు.

అది చాలనట్టు… సాగు చట్టాలపై రైతుల వ్యతిరేకత, ప్రైవేటీకరణ, నిరుద్యోగం, పెట్రోల్‌, డీజిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం, ఆర్థిక ఇబ్బందుల వంటి అనేక సమస్యలు బీజేపీ కి ఉండనే ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఆ పార్టీకి అన్ని సీట్లు అంటే ఏఐఏడీఎంకే కు ఆత్మహత్యాసదృశ్యమే.

ఇది ఇలా ఉంటే.. ఆంధ్రలో జనసేనను బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతుంది అనే కంగారు జనసైనికులలో ఇప్పటి నుండే మొదలయ్యిందట. అయితే బీజేపీ నాయకులు మాత్రం తాము 2024 నాటికి విపరీతంగా బలపడి ఏపీలో సగం సీట్లు కోరతామని అంతర్గత చర్చలలో అంటున్నారట. బీజేపీకి అన్ని సీట్లు అంటే జనసేన పోటీ చెయ్యకముందే సీఎం పీఠం మీద అసలు వదిలేసుకున్నట్టే.