kanna-lakshminarayana-jagan గత రెండురోజుల నుండీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పాచిక వేసింది. దానికి బీజేపీ వారు బానే పడిపోయినట్టుగా కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా జగన్ ప్రభుత్వంలో తిరుమల సాక్షిగా అనేక వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా స్వామివారి వెండి కిరీటం, ఉంగరాలు మాయం కావడం సంచనలం అయ్యింది. దీనిని ఆసరాగా తీసుకుని బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బలపడే ప్రయత్నం చేస్తుంది. దీనిని జగన్ వారి రూట్ లోకే వచ్చి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గాల్లోకి ఎత్తుతూ ఆయన వీడియో సోషల్ మీడియాలో షేర్లు చేస్తూ ఆయనేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా హిందూమతాన్నీ తిరుమల పవిత్రతను కాపాడడానికి నడుంకట్టినట్లు ప్రచారం చేస్తున్నారు. హిందూ దేవాలయాలలో ఇతర మతస్థులు ఉండరాదని ప్రభుత్వం చెప్పిందంట. దీనిని బీజేపీలోని కరడు గట్టిన హిందుత్వవాది అయిన రాజాసింగ్ కూడా స్వాగతించారు. ఇక్కడ అర్ధం కానిది ఏమిటంటే ఇది ఎప్పటి నుండో ఉన్న రూల్. ప్రభుత్వం కొత్తగా చెప్పేది? చేసేది ఏముంది?

పోనీ ఈ ప్రభుత్వమే ఏదో చేసింది అనుకుంటే జీవోలు ఏమీ ఇవ్వకుండా, నామమాత్రంగా మీడియాతో చెప్పే మాటల వల్ల ఉపయోగం ఏమిటి? దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ సమర్ధకులు జగన్ ను హిందూ మతఉద్ధారకుడు అని పొగడ్తలతో ముంచెత్తుతుంటే, బీజేపీ వారు తన్మయత్వంతో మెలికలు తిరిగిపోతున్నారు. ఇక ముందు ఇటువంటి వివాదం ఏమొచ్చినా చీఫ్ సెక్రటరీ స్టేట్మెంట్ ను తిప్పుతారు. ఏది ఎలా ఉన్నా బీజేపీ ప్లాన్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేసిన కౌంటర్ ప్లాన్ అదిరిపోయిందనే చెప్పాలి.