Chandrababu Naidu - Polavaramబీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పోలవరం నిర్మాణానికి కేంద్రం 100 శాతం నిధులు ఇవ్వాలని మాత్రమే చట్టంలో ఉంది… పోలవరాన్ని ఎప్పటికి కట్టాలనే కాలపరిమితి చట్టంలో లేదని ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఇండైరెక్ట్ గా మేము అనుకున్నప్పుడు కడతాం అడగడానికి ఎవరు సరిపోరు అని చెప్పినట్టేగా.

ఈ మాట విన్నాకా కూడా ప్రాజెక్టును కేంద్రానికి ఎందుకు అప్పగించలేదు అని ఎవరైనా అడగగలరా? ఇదే ప్రాజెక్టును కట్టమని కేంద్రానికి అప్పగిస్తే దానిమీద అసలు వదిలేసుకునే పరిస్థితి వచ్చేదేమో. చంద్రబాబుని విమర్శించే వారికి సోము వీర్రాజు సమాధానం ఇచ్చినట్టే. నిధుల ప్రవాహానికి ఇబ్బంది పెడతారనే గ్రహించి చంద్రబాబు వేరే ప్రత్యామ్న్యాయాం కూడా చూసారు.

పట్టిసీమ, పురుషోత్తం పట్నం ప్రాజెక్టులు రెండు ప్రస్తుతానికి పోలవరానికి ప్రత్యామ్న్యాయాం కాగలవు. పట్టిసీమ ప్రాజెక్టును అప్పుడే రికార్డు సమయంలో పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చారు. పురుషోత్తం పట్నం ప్రాజెక్టు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబు ముందుచూపు రాష్ట్రానికి మేలుచేసేదిగా ఉంది.