BJP candidate kasani veeresh withdrew the nominationతెలంగాణాలో బీజేపీ పరిస్థితి దయనీయంగా ఉంది. అతికష్టం మీద అన్ని స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెట్టిన ఆ పార్టీకు ఇప్పుడు అనుకోని షాక్ తగిలింది. తమ పార్టీ కుత్బుల్లాపూర్ అభ్యర్థి కాసాని వీరేష్ తన నామినేషన్ ను విరమించుకున్నారు. ఆయన శనివారం మధ్యాహ్నం పార్టీలో చేరిన ఆయనకు సాయంత్రానికి టిక్కెట్టు ఇచ్చింది పార్టీ. సోమవారం ఆయన నామినేషన్ వేశారు. నామినేషన్ వేసిన ఒక్క రోజు తరువాత దానిని విరమించుకున్నారు.

ఇప్పటికే నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో అక్కడ బీజేపీకి అభ్యర్థి లేకుండా పోయింది. నామినేషన్ విమరించుకోవడానికి కారణం కాసాని వీరేష్ చిన్ననాన్న కాసాని జ్ఞానేశ్వర్ కు కాంగ్రెస్ టికెట్ రావడమే. ఆయన సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. బాబాయ్ అబ్బాయిలు చెరోపార్టీ నుండి పోటీ చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని వీరేష్ బారి నుండి తప్పుకున్నారు. దీనితో బీజేపీ రాష్ట్ర నాయకులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

అద్దెకు నాయకులను తెచ్చుకుని టిక్కెట్లు ఇస్తే ఏమవుతుందని ఆ పార్టీకి ఇప్పటికైనా అర్ధమయ్యి ఉండాలి. పరువు పోకుండా అన్ని స్థానాలలో పోటీ ఉండాలని ఇలాంటి తప్పులు ఆ పార్టీ చాలానే చేసింది. ఇప్పుడు అందులో ఎంత మంది డిపాజిట్లు తెచుకోగలరో? మరోవైపు గత 30 ఏళ్లుగా రాజకీయాలలో తలపండిన నేత కాసాని జ్ఞానేశ్వర్ గత నాలుగు ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ టీడీపీ తరపున పోటీ చెయ్యడానికి విశ్వప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఈసారి చివరి నిముషంలో కాంగ్రెస్ ఆయనను సికింద్రాబాద్ నుండి బరిలో దింపింది.