BJP Bikes in Andhra Pradeshఎపిలో బిజెపిని బలోపేతం చేయడానికి గాను ఆ పార్టీ హై కమాండ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అత్యంత కీలకమైన ఒక్కో కార్యకర్త ఒక్కో ద్విచక్రవాహనం ఇస్తారట. గతంలో ఉత్తర ప్రదేశ్ లోకూడా ఇదే తరహా వ్యూహం అనుసరించారు. ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో వినియోగించిన ద్విచక్రవాహనాలను విజయవాడకు తరలించింది.

పూర్తిగా పార్టీ కార్యకలాపాలపైనే దృష్టి పెట్టే చురుకైన వ్యక్తులను ఎంపిక చేసేపనిలో పడింది పార్టీ. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నుంచి 175 వాహనాలను ఆంధ్రప్రదేశ్‌కు పంపాలన్నది పార్టీ నిర్ణయం. ఇప్పటికే 135 వాహనాలు విజయవాడ చేరుకున్నాయని కదనం. అయితే నియోజకవర్గానికి ఒక బైక్ అంటే కార్యకర్తలు ఏ మేరకు ఉత్సాహంగా ఉంటారో తెలీదు.

పైగా ఇవన్నీ ఇప్పటికే వాడేసిన బైకులు. మరోవైపు ఆ పార్టీకి భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలో తెలియని పరిస్థితి. ఒకవర్గం తెలుగు దేశంతో పొత్తు వైపు మొగ్గుతుంటే, మరోవైపు ఇంకో వర్గం మిత్రపక్షాన్నే ఇరుకున పెట్టాలని చూస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు బిజెపి రాష్ట్రంలో బలపడటం కుదిరే పనేనా!