Chandrababu Naidu questions narendra modi on utilisation certificatesఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రోజు పర్యటనకు సింగపూర్ వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి టీడీపీ ఫోరం సభ్యులతో కాసేపు మాట్లాడారు. ‘‘విభజన తర్వాత మన రాష్ట్రమే కొత్తరాష్ట్రంలా ఉంది. ఏపీకి న్యాయం చేస్తారని బీజేపీతో పొత్తు పెట్టుకుని స్నేహంగా మెలిగాం. ఆశలు ఆడియాసలు చేశారు,” అని చంద్రబాబు వాపోయారు

“ఏపీకి ద్రోహం చేశారు. ఏపీ అభివృద్ధిని చూసి అసూయ, ఈర్ష్యకు గురయ్యారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయనిరాకరణ చేస్తోంది. గుజరాత్‌లో విగ్రహం ఏర్పాటుకు 2500 కోట్లు ఖర్చు చేశారు. అమరావతి నిర్మాణానికి 1500 కోట్లు మాత్రమే ఇచ్చారు’’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు.

మరోవైపు కర్ణాటక ఎన్నికల తరువాత ఏపీలో అనూహ్యపరిణామాలు జరగబోతున్నాయని, దానితో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుందని రాష్ట్ర బీజేపీ నేతలు బాహాటంగానే బెదిరిస్తున్నారు. దీనితో కేంద్రం రాష్ట్రప్రభుత్వంపై ఏదైనా కక్షసాధింపు చర్యలకు దిగబోతుందా అనే అనుమానాలు కలుగుతున్నవి.