BJP Amit Shah Andhra Pradesh Capital Amaravati padayatraవైసీపీ సర్కార్ పుణ్యమా అంటూ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందగా, అందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా సహకరిస్తోందన్న వాదన ఇప్పటికే రాష్ట్ర ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.

ఇదిలా ఉంటే రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలంటూ గత రెండేళ్లుగా రైతులు పోరాటం చేస్తున్నారు. అలాగే ఇటీవల పాదయాత్ర కూడా చేస్తుండగా, దానిని వైసీపీ అడ్డుకోవడం – లాఠీఛార్జ్ చేయడంతో మరింత ఉధృత రూపం దాల్చుకుంది.

అమరావతి రైతులు చేస్తోన్న ఉద్యమం సెగ బీజేపీకి తగిలిందో ఏమో గానీ, రాష్ట్ర బీజేపీ నాయకులను ఈ పాదయాత్రలో పాలు పంచుకోవాల్సిందిగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీచేశారు. స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు అండగా ఉండాలని అన్నారు.

అంతేకాదు, ఎప్పుడు ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశంపై విమర్శలు చేయవద్దని, ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేయాలని, పొత్తులపై ఎవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని, ఇది పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని రాష్ట్ర బీజేపీ నాయకులతో జరిగిన సమావేశంలో తెలిపారు.