Vijay Deverakondaతప్పు లేదు టాప్ హీరోలకు ఫాన్స్ ఉంటారు…వారు తమ హీరోపై అభిమానాన్ని పలు రకాలుగా చూపిస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో అందులో కాస్త అతిగా ప్రవతించే అభిమానులు ఎక్కువైపోతున్నారు అని తాజాగా జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే తెలుస్తుంది.

సోషల్ మీడియాలో చూస్తున్న వింతలు ప్రకారం ఒకడేమో ఒక స్టార్ హీరో అభిమానిగా, ఆ సినిమా ఫ్లాప్ అయితే, సినిమా కలెక్షన్స్ పెంచడానికి ఒకటికి పది సార్లు సినిమా చూసి కలెక్షన్స్ పెంచుతా అంటాడు..ఇంకొకడు మా హీరో పుట్టిన రోజు మరో 100 రోజులు ఉంది…ఈ వంద రోజులు మా హీరో నటించిన సినిమాల్లో 100 సినిమాలను రోజుకొకటి చప్పున చూస్తాను అంటాడు. ఇక తాజాగా తమిళ ట్రెండ్ ఒకటి మన తెలుగు హీరోల అభిమానులకు అంటుకుంది అదేంటి అంటే, ట్విట్టర్ లో 100 రోజుల పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలపడం.

తాజాగా ఈ కోవలోకే వచ్చి చేరారు మన రౌడీ సిఎం అయిన విజయ్ దేవరకొండ అభిమానులు. మరో 100 రోజుల్లో విజయ్ పుట్టిన రోజు ఉందట అందుకే ‘100 డేస్ టు విజయ్ దేవరకొండ బర్త్ డే’ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేసే పనిలో పడ్డారు విజయ్ అభిమానులు.

అయితే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే అందరి అభిమానులు లాగా కాదు విజయ్ అభిమానులు అని చాలా సార్లు చెప్పుకున్నాం కానీ, వాళ్ళు కూడా షరా మామూలే అని ఇదిగో ఈ వ్యవహారంతో అర్ధం అయిపోయింది.