Bipasha Basu Hospitalised-‘జిస్మ్’ చిత్రంతో యువ హృదయాలను దోచుకున్న బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ బిపాసాబసు తెలుగునాట కూడా మహేష్ బాబుతో ‘టక్కరిదొంగ’ సినిమాలో నటించి, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయ్యింది. బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న బిపాసా, ప్రస్తుతం ముంబైలో ఓ హాస్పిటల్ లో ఉంది. శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుతోన్న బిపాసాను కుటుంబ సభ్యులు ముంబైలోని ఓ స్థానిక హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇటీవల కాలంలో తరచుగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతుండడంతో రెగ్యులర్ గా సదరు హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటుండగా, ఈ సారి శృతిమించడంతో హాస్పిటల్ లో జాయిన్ కావాల్సి వచ్చిందని తెలుస్తోంది. మరికొన్ని రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉండబోతోన్న బిపాసా, త్వరలోనే తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ కాంభినేషన్ లో ఓ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.