BIPASHAఒకప్పటి ‘జిస్మ్’ హాట్ బ్యూటీ బిపాసాబసు మళ్ళీ రెచ్చిపోతోంది. అయితే ఈ సారి వెండితెరపై కాదు, తన ‘ఇన్ స్టాగ్రామ్’ ఎకౌంట్ వేదికగా బీచ్ ఫోటోలతో సందడి చేస్తోంది. ‘ఎలోన్’ సినిమా ఫ్లాప్ తో సినీ అవకాశాలకు దూరమైన బిపాసాబసు, కొత్త సంవత్సరం వేడుకలను తన లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి బీచ్ ఒడ్డున జరుపుకుంది.

దీనికి సంబంధించిన ఫోటోలను తన ‘ఇన్ స్టాగ్రామ్’ ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. జాన్ అబ్రహంతో మొదలుకొని ఇప్పటికే ముగ్గురు హీరోలతో బ్రేకప్ చెప్పిన ఈ ‘బ్లాక్ బ్యూటీ,’ తాజాగా కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి టూ పీస్ బికినీతో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ బీచ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రపంచానికి దూరంగా మాల్దీవులలో కనువిందు చేసిన బిపాసా హాట్ ఫోటోలు… వీక్షకుల కోసం..!