biggboss-telugu-prince-dikshaఇప్పటివరకు చప్పగా సాగిన ‘బిగ్ బాస్’ హౌస్ లోకి సోమవారం నాడు దీక్షాపంత్ హాట్ ఎంట్రీతో కళాకాంతి వచ్చినట్లయ్యింది. వచ్చిన రోజే స్విమ్మింగ్ పూల్ లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మను శివబాలాజీ, ప్రిన్స్ వంటి రొమాంటిక్ డైలాగ్స్ తో పడేసే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి ముద్దుగుమ్మనే పంపండి అంటూ బిగ్ బాస్ కు ప్రిన్స్ చేసిన విజ్ఞప్తికి పూర్తి న్యాయం చేసే విధంగా… తాజాగా జరిగిన ఎపిసోడ్ లో దీక్షాపంత్ కు ప్రిన్స్ ఏకంగా ఓ ముద్దు పెట్టేసాడు.

‘సారీ’ చెప్పే భాగంగా… దీక్షాను బుజ్జగిస్తున్న ప్రిన్స్, అందుకు ఒప్పుకోకపోవడంతో ఒక్కసారిగా ‘సారీ’ అంటూ బుగ్గపై ముద్దు పెట్టేసాడు. దీంతో అవాక్కైన దీక్షా చిరుదరహాసం పండించింది. అలాగే పక్కన ఉన్న తోటి సహచారులంతా కూడా ఒక్కసారిగా నవ్వేసారు. దీంతో ‘బిగ్ బాస్’ లో అఫిషియల్ రొమాన్స్ ప్రారంభమైనట్లయ్యింది. మరి మున్ముందు ప్రిన్స్ ఏం చిలిపి పనులు చేస్తాడో గానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.