Bigg Boss Telugu 4తాజా టీవీ రేటింగ్స్ ప్రకారం బిగ్ బాస్ తెలుగు 4 వారం మధ్య రోజులలో కూడా బాగానే ఉంది. ఆ రోజులలో సగటున 8.05 టీవీఆర్‌తో, రియాలిటీ షో మళ్లీ విజేతగా అవతరించింది. ఈసారి ప్రముఖలెవ్వరు షోలో లేనప్పటికీ మంచి రేటింగ్స్ సాధించడం విశేషం. పార్టిసిపంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే మంచి కంటెంట్‌ను ఇవ్వడం వల్ల మంచి రేటింగ్ వస్తుంది.

లాక్‌డౌన్‌లో ఇతర వినోదాలు కూడా లేకపోవడంతో ఈ షోకు హెల్ప్ అవుతుంది. మరోవైపు ఈ షో యొక్క రెండవ వారాంతంలో 10.72 టీవీఆర్ రేటింగ్స్ వచ్చాయి. ఇది కూడా మంచి రేటింగ్ అనే చెప్పుకోవాలి. నాగార్జున హోస్టింగ్ ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు అనేదానికి మరో ఉదాహరణ.

సూర్య కిరణ్ మరియు కరాటే కల్యాణి ఎలిమినేషన్ల తరువాత, మోనాల్, అబీజీత్, లాస్యా, సుజాత, అరియానా, సయ్యద్, అలేఖ్య, దేవి, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, నోయెల్, దివి, అఖిల్, గంగవ్వా, కుమార్ సాయి, మరియు జబర్దాస్త్ ముక్కు అవినాష్ పోటీదారులు ట్రోఫీ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఈ షోకు ఇప్పటివరకు గంగవ్వ హైలైట్ అని చెప్పుకోవాలి. ఆమెకు విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు తన హావభావాలు.. అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాగా ఈ వారంలో షో నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదాని మీద ఆసక్తికర చర్చ జరుగుతుంది.