Bigg Boss Telugu Season 2 contestantsతెలుగులో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ‘బిగ్ బాస్’ కార్యక్రమాన్ని తన భుజస్కందాలపై వేసుకుని విజయవంతం చేసిన ఖ్యాతి జూనియర్ ఎన్టీఆర్ సొంతమైంది. హౌస్ లో ఉండాల్సిన సెలబ్రిటీల జాబితాపై ప్రేక్షకులు బహిరంగంగానే పెదవి విరిచినప్పటికీ, తన వాక్చాతుర్యంతో జూనియర్ ఎన్టీఆర్ షోను అలా నెంబర్ 1 స్పాట్ లో నిలబెట్టేసి, తనవరకు పూర్తి న్యాయం చేసాడు. అందులోనూ ‘బిగ్ బాస్’ కాన్సెప్ట్ అసలు ఎలా ఉంటుంది అన్న ఆసక్తితో కూడా ప్రేక్షకులు ఎదురుచూసారు గనుక, సెలబ్రిటీల జాబితాకు అతీతంగా ఈ షో బుల్లితెరపై ఘనవిజయం సాధించింది.

కానీ ‘బిగ్ బాస్’ సీజన్ 2లో మాత్రం ఆ తప్పు జరగకుండా ప్రముఖ సెలబ్రిటీలను ఎంపిక చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే పలువురు టాప్ సెలబ్రిటీలతో సంప్రదింపులు జరుపుతున్న నిర్వాహకులు, ఈ విషయంలో ఎలాంటి అసంతృప్తి లేకుండా చేయబోతున్నారని టాక్. టాలీవుడ్ గ్లామర్ డాల్ ఛార్మి మరియు ఊర మాస్ పాటల సింగర్ గీతా మాధురిలతో చర్చలు జరిపినట్లు, వారు కూడా సూత్రప్రాయంగా ఒకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు మిగిలిన సెలబ్రిటీలు కూడా ప్రేక్షకులకు సుపరిచితమైన వారే ఉండనున్నారని తెలుస్తోంది.