bigg boss season 2 hot and date‘బిగ్ బాస్’ సీజన్ 1ను అద్భుతంగా పండించడంలో ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ నూటికి రెండు వందల శాతం సక్సెస్ సాధించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రారంభమైన ఈ షో తెలుగు నాట క్లిక్ కావడానికి ప్రధాన కారణం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. సరిగ్గా ‘జై లవకుశ’ సినిమా విడుదల వరకు సాగిన ఈ సీజన్ 1 విజేతగా శివబాలాజీని ప్రకటించి, ప్రైజ్ మనీ 50 లక్షల రూపాయలను అందజేశాడు. ఫైనల్ ఎపిసోడ్ దాదాపుగా నాలుగున్నర్ర గంటల పాటు బుల్లితెరపై సందడి చేసింది.

ఓ పక్కన జై లవకుశ… మరో పక్కన బిగ్ బాస్… ఇలా బిజీబిజీగా గడిపిన జూనియర్ ఎన్టీఆర్ కొన్నాళ్ళ పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తారక్ జత కడుతుండగా, ‘బిగ్ బాస్’ సీజన్ 2ను కూడా జూనియరే హోస్ట్ చేయబోతున్నాడు. ఈ విషయం ఇంతకుముందే హల్చల్ చేయగా, తాజాగా ఇది అధికారికమైంది. ఛాలెంజింగ్ గా తీసుకుని చేసిన ‘బిగ్ బాస్ తెలుగు’ బాగా ఎంజాయ్ చేసానని, ఇందుకు గానూ స్టార్ మా ఛానల్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఇక నుండి ‘నా టీవీ’ని మిస్ అవుతున్నానని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

దీనిపై స్పందించిన ‘స్టార్ మా’… తారక్ కు థాంక్స్ చెప్తూ… బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కోసం కలుద్దామని, మళ్ళీ ఇరువురం కలిసి పని చేద్దామని స్పష్టత ఇచ్చింది. దీంతో రెండవ సీజన్ ను కూడా తారక్ హోస్ట్ చేయనున్నాడనేది స్పష్టమైంది గానీ, ఈ రెండవ సీజన్ ఎప్పుడు ప్రారంభం కానుందనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనబోయే వారు కాస్త హాట్ చిక్స్ ఉండవచ్చని, ఆ రీత్యా ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నారని, అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరిలో గానీ, వచ్చే ఏడాది మొదట్లో గానీ సీజన్ 2 ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.