bigg-boss-2-telugu-host-nani-fires-on-netizens‘బిగ్‌ బాస్ 2’ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తోన్న నాచురల్ స్టార్ నాని నెటిజన్లపై ఫైర్ అయ్యాడు. బిగ్‌ బాస్ ఇంటి సభ్యులపై నెటిజన్ల నుంచి వస్తున్న కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ… హౌస్‌లోని అందరూ అందరికీ నచ్చాలనేమీ లేదని, ఆ విషయాన్ని చెప్పొచ్చు కానీ, అసభ్య పదజాలంతో కామెంట్స్ చేయడం సరికాదని అన్నాడు. తేజస్వి విషయంలో వస్తున్న కామెంట్స్ చూస్తుంటే బాధగా ఉందన్నాడు. బయట ఇలాంటి మనుషులు ఉన్నారా? అని అనిపిస్తోందని, కామెంట్స్ చేయడానికి కూడా ఓ హద్దు ఉంటుందని మండిపడ్డారు.

‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బిగ్‌ బాస్ హౌస్‌లోకి వచ్చిన మంచు లక్ష్మి, హౌస్‌మేట్స్ తో కలిసి కాసేపు సందడి చేసింది. లక్ష్మి కోసం రోల్‌ రైడా ఓ పాట పాడగా, గణేశ్ ఆర్జేగా అవతారమెత్తాడు. ఈ సారి నానికి బదులు మంచు లక్ష్మి ఎలిమినేషన్‌ పేరును ప్రకటించింది. తేజస్వీ పేరు ప్రకటించగానే హౌస్‌లోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా సామ్రాట్‌ కు నోట మాట రాలేదు, షో చివరి వరకు మూడీగానే ఉన్నాడు. ఇక, తేజస్వీ వెళ్తూవెళ్తూ… బిగ్‌ బాంబ్‌లో భాగంగా గణేశ్ ఈ వారమంతా పాలసీసాతో నీళ్లు తాగాల్సి ఉందని వేసింది.