Bigboss Telugu Deeskha‘బిగ్ బాస్’ షో ప్రారంభమైన మొదటి రోజున… ఈ కార్యక్రమం హోస్ట్ చేస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ హౌస్ లోకి ప్రవేశించి, సదరు ఇల్లంతా తిరిగిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్ లో అన్నింటి కంటే ‘స్విమ్మింగ్ పూల్’ తారక్ కు ఎక్కువగా ఆకర్షించగా, అందులో మొదట వెళ్ళిన పార్టిసిపెంట్స్ ఆ స్విమ్మింగ్ పూల్ వైపుకు వెళ్తారని ఎన్టీఆర్ ఎంతో ఆసక్తిగా చూడగా, ఇంతవరకు ఆ స్విమ్మింగ్ పూల్ వైపుకు ఒక్కరు కూడా కన్నెత్తి చూడని వైనం తెలిసిందే.

బహుశా ఎన్టీఆర్ కు స్విమ్మింగ్ పూల్ అంత మక్కువని పార్టిసిపెంట్స్ కు తెలియదేమో గానీ, సదరు కార్యక్రమాన్ని వీక్షించిన ప్రేక్షకులకు మాత్రం తెలుసు. ఇలా టీవీ ద్వారా వీక్షించిన ముద్దుగుమ్మ దీక్షాపంత్, సోమవారం నాడు ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ప్రవేశించగా, వెళ్తూ వెళ్తూనే జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత ప్రీతిపాత్రమైన స్విమ్మింగ్ పూల్ లో దిగి సందడి చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోను సదరు ఛానల్ విడుదల చేయగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇప్పటివరకు ‘బిగ్ బాస్’ హౌస్ లో ‘హాట్ నెస్’ కొరవైంది అన్న విమర్శలు ఎదుర్కొన్న తరుణంలో… దీక్షా ఎంట్రీతో ఆ ముచ్చట తీరుతుందని వీక్షకులు భావిస్తున్నారు. దీక్షా పంత్ హౌస్ లోకి సర్ ప్రైజ్ ఎంట్రీ చూడగానే ప్రిన్స్, ఆదర్శ్ యువనటులు ఆనందంలో మునిగి తేలిన వైనం ఈ ప్రోమోలో స్పష్టంగా కనపడుతోంది. దీంతో రానున్న రోజుల్లో తెలుగు ‘బిగ్ బాస్’ కూడా కలర్ ఫుల్ గా మారే సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా దీక్షను హౌస్ లోకి పంపిస్తున్నట్లుగా తారక్ ఇప్పటికే ఖరారు చేసిన విషయం తెలిసిందే.