Bhumika Chawla casting couch‘ఖుషీ, ఒక్కడు, సింహాద్రి’ సినిమాలతో ఇండస్ట్రీ హిట్ లను సొంతం చేసుకున్న బ్యూటీ భూమిక చావ్లా ప్రస్తుతం టాలీవుడ్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. నాని “ఎంసీఏ”తో మొదలుకుని “సవ్యసాచి, పాగల్, సీటిమార్” సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తోన్న భూమిక, ఇండస్ట్రీలో సహజంగా వినిపించే ‘కాస్టింగ్ కౌచ్’పై వ్యాఖ్యలు చేసారు.

నిజానికి తానెప్పుడూ ‘కమిట్ మెంట్’ అన్న దానిని ఎదుర్కొలేదని, తనకు కధ చెప్పాలని అనిపిస్తే ముంబై వచ్చి వినిపించేవారని, నచ్చిన కధలను తాను చేసుకుంటూ వచ్చానని చెప్పుకొచ్చింది. నిర్మాతలతో ఎప్పుడూ ‘టచ్’లో ఉంటేనే అవకాశాలు వస్తాయన్న విషయాన్ని తాను నమ్మనని, ఇలాంటివి తన కెరీర్ లో చవిచూడలేదని తెలిపింది.

బాలీవుడ్, టాలీవుడ్ లలో ఎంతో మంది టాప్ హీరోయిన్లు ‘కాస్టింగ్ కౌచ్’ అంశాన్ని పబ్లిక్ చేయగా, దానికి విరుద్ధంగా భూమిక చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలకు ఊరటనిచ్చే అంశమే. ఏది ఏమైనా భూమిక మాత్రం ఎప్పుడూ హద్దులు దాటి తన గ్లామర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూపించకపోవడంతో, ఈ బ్యూటీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.