Bhuma Brahmananda Reddy2014 ఎన్నికల తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ ను టీడీపీలోకి వచ్చింది భూమా కుటుంబం. నాగిరెడ్డి మరణంతో అఖిల ప్రియా మంత్రి కూడా అయ్యారు. తండ్రి సీటు సోదరుడికి ఇప్పించుకుని గెలిపించుకున్నారు. ఇటీవలే జరిగిన ఎన్నికలలో భూమా కుటుంబం ఓడిపోయింది. అప్పటి నుండీ అఖిల ప్రియా మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతుందని ప్రచారం జరుగుంది. అఖిల ప్రియా కూడా ఈ ప్రచారం మీద మౌనంగా ఉండటం, పార్టీ కార్యక్రమాలలో క్రియాశీలకంగా ఉండకపోవడంతో మార్పు ఖాయమని అంతా అనుకుంటున్నారు.

ఈ క్రమంలో భూమా బ్రహ్మానంద రెడ్డి పార్టీ మారడంపై స్పందించారు. “గత కొన్ని రోజులుగా కొన్ని టీవీ చానెల్స్ ప్రసారం చేస్తున్నట్టు నేను పార్టీ మారడం లేదు పేరు ఉన్న చానెల్స్ నిజాలు తెలుసుకోకుండా ఇలా తప్పుడు ప్రసారాలు చెయ్యడం మంచిది కాదు. ఓటమికి భయపడిపోయి పార్టీ మారిపోయే పిరికివాడిని కాదు .నా వ్యక్తిత్వాన్ని గెలుపుఓటములు మార్చలేవు నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం . తెలుగుదేశంతోనే చివరి దాక నా ప్రయాణం . భవిష్యత్తులో ఇలాంటి ప్రచారాలు చెయ్యవద్దని చానెల్స్ కు నా మనవి,” అని ఆయన ఫేస్ బుక్ లో వ్యాఖ్యానించారు.

అయితే ఈ ప్రకటనలో ఎక్కడా అఖిలప్రియ గురించి చెప్పకపోవడం విశేషం. అఖిలప్రియ కూడా పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. తన వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే భూమా కుటుంబం తలోదారి చూసుకుంటుందా అనే అనుమానం అందరిలో ఉంది. కుటుంబంలో ఏమైనా స్పర్ధలు ఉన్నాయా అనే అనుమానాలు రాకమానవు. ఒకవేళ అదే జరిగితే అఖిలప్రియ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలయ్యిందో అక్కడికే చేరబోతోంది.