Bhuma Akhila Priya Reddy - Bhuma Brahmananda Reddy- Shilpa Mohan Reddy - Nandyal By-Election Bypoll !రౌండ్ రౌండ్ కు ఫలితం మారి, ఉత్కంఠభరితంగా సాగుతుందని భావించిన నంద్యాల ఉప ఎన్నికల ఫలితం… ‘బాద్ షా’లో డైలాగ్ మాదిరి ‘వార్ వన్ సైడ్’ అయ్యింది. వరుసగా 15 రౌండ్ల పాటు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన తెలుగుదేశం పార్టీ, ఒక్క 16వ రౌండ్ లో మాత్రం 654 ఓట్లు వెనుకబడి, మళ్ళీ మిగిలిన మూడు రౌండ్లలోనూ పుంజుకుంది. మొత్తంగా 19 రౌండ్ల లెక్కింపు జరుగగా, 18 రౌండ్లలో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించగా, ఒకే ఒక్క రౌండ్ లో వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి లీడ్ లోకి వచ్చారు.

రౌండ్ రౌండ్ కు ఇలా దెబ్బ కొట్టింది!        
4వ రౌండ్ టీడీపీకి 6465 వైసీపీకి 2859 కాంగ్రెస్ కు 56 టీడీపీ ఆధిక్యత 3606
5వ రౌండ్ టీడీపీకి 6975 వైసీపీకి 3563 కాంగ్రెస్ కు 87 టీడీపీ ఆధిక్యత 3412
6వ రౌండ్ టీడీపీకి 6161 వైసీపీకి 2829 కాంగ్రెస్ కు 69 టీడీపీ ఆధిక్యత 3332
7వ రౌండ్ టీడీపీకి 4859 వైసీపీకి 4312 కాంగ్రెస్ కు 55 టీడీపీ ఆధిక్యత 547
8వ రౌండ్ టీడీపీకి 4436 వైసీపీకి 4088 కాంగ్రెస్ కు 51 టీడీపీ ఆధిక్యత 348
9వ రౌండ్ టీడీపీకి 4309 వైసీపీకి 3430 కాంగ్రెస్ కు 65 టీడీపీ ఆధిక్యత 879
10వ రౌండ్ టీడీపీకి 4642 వైసీపీకి 3622 కాంగ్రెస్ కు 51 టీడీపీ ఆధిక్యత 1486
11వ రౌండ్ టీడీపీకి 4226 వైసీపీకి 3622 కాంగ్రెస్ కు 51 టీడీపీ ఆధిక్యత 604
12వ రౌండ్ టీడీపీకి 5629 వైసీపీకి 4359 కాంగ్రెస్ కు 84 టీడీపీ ఆధిక్యత 1270
13వ రౌండ్ టీడీపీకి 5690 వైసీపీకి 4235 కాంగ్రెస్ కు 76 టీడీపీ ఆధిక్యత 1460
14వ రౌండ్ టీడీపీకి 5172 వైసీపీకి 3268 కాంగ్రెస్ కు 77 టీడీపీ ఆధిక్యత 1304
15వ రౌండ్ టీడీపీకి 5770 వైసీపీకి 4328 కాంగ్రెస్ కు 89 టీడీపీ ఆధిక్యత 1442
16వ రౌండ్ టీడీపీకి 4663 వైసీపీకి 5317 కాంగ్రెస్ కు 0 వైసీపీ ఆధిక్యత 654
17వ రౌండ్ టీడీపీకి 5163 వైసీపీకి 4248 కాంగ్రెస్ కు 0 టీడీపీ ఆధిక్యత 915
18వ రౌండ్ టీడీపీకి 4467 వైసీపీకి 3961 కాంగ్రెస్ కు 0 టీడీపీ ఆధిక్యత 506
19వ రౌండ్ టీడీపీకి 951 వైసీపీకి 554 కాంగ్రెస్ కు 0 టీడీపీ ఆధిక్యత 397

ఈ రెండు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు చివరి నాలుగు రౌండ్స్ లలో ఒక్క ఓటు కూడా లేకపోవడం విశేషం. ఈ ఫలితంపై మాజీ కాంగ్రెస్ నేత సబ్బం హరి మాట్లాడుతూ… చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకే ఓటర్లు జై కొట్టారని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వల్ల టీడీపీ అధికారంలోకి రాలేదనే విషయాన్ని చంద్రబాబు నిరూపించారని తెలిపారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, నోరు పారేసుకునే జగన్, రోజా లాంటి వాళ్లకు నంద్యాల తీర్పు ఓ గుణపాఠమని ఎద్దేవా చేశారు.