Bheeshma Box Office Collectionsయంగ్ హీరో నితిన్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన భీష్మ బాక్స్ ఆఫీసు వద్ద మెరుపులు మెరిపిస్తుంది. రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా సినిమా కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈరోజు ఆదివారం ఎడ్వాంటేజ్ తో మరింత గా పెర్ఫర్మ్ చెయ్యబోతుంది. ఇది ఇలా ఉండగా అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సినిమా మెరుగ్గా రాణిస్తుంది.

శనివారం ఒక్క రోజే $225కే రాబట్టింది. దీనితో హాఫ్ మిలియన్ డాలర్స్ గ్రాస్ దాటింది. సండే ఎడ్వాంటేజ్ కూడా ఉంటుంది. దీనితో ఫుల్ రన్ లో సినిమా వన్ మిలియన్ డాలర్స్ మార్క్ దాటడం లాంఛనమే అని చెప్పుకోవాలి. వచ్చే వారాంతానికి సినిమా ఆ మార్కుని దాటే అవకాశం ఉందని తెలుస్తుంది.

అ… ఆ తరువాత నితిన్ కి మరో వన్ మిలియన్ డాలర్ సినిమా లేదు. దీనితో ఈ సినిమా అతనికి స్పషల్ అనే చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై 29 కోట్ల బిజినెస్ జరిగింది. టాక్, రివ్యూస్ బావుండడంతో ఇది ఈజీ టార్గెట్ అనే చెప్పుకోవాలి. 2020లో టాలీవుడ్ కు మూడవ కమర్షియల్ హిట్… భీష్మ.

సంక్రాంతి సినిమాల తరువాత తెలుగులో సరైన సినిమా రాకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఆదరిస్తున్నారు. నితిన్ గత ఏడాది నటించిన ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు నిరాశపరిచాయి.
ఆ మాటకొస్తే 2016లో వచ్చిన అ..ఆ తర్వాత నితిన్ కు సరైన సక్సెస్ లేదు. దీనితో ఈ సినిమాకు వస్తున్న ఆదరణ తో నితిన్ రిలీఫ్ గా ఫీల్ అవుతాడు.