నితిన్ లేటెస్ట్ మూవీ ‘భీష్మ’ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో నేడు విడుదల చేశారు. తనకు బాగా నప్పే రొమాంటిక్ ఎంటెర్టైనెర్ తో నితిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ‘నడుముకుడా విజయ్ మాల్యా లాంటిదిరా…, కనిపిస్తుంటది కానీ క్యాచ్ చేయలేమ్’ అని నితిన్ రష్మిక అందమైన నడుమును ఉదేశిస్తూ చెప్పిన డైలాగ్ తో మొదలైన వీడియో చాలా రొమాంటిక్ గా ఉంది.
చీరలో రష్మిక మందన్నా బ్యూటిఫుల్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ కూడా అదిరిపోయింది. సినిమా కూడా ఇలాగే కూల్ గా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటే నితిన్ ఖాతాలో మరో హిట్ పడినట్టే. ఈ లవ్ ఎంటర్టైనర్ ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నట్లు రిలీజ్ డేట్ కూడా వీడియో లో ప్రకటించేశారు. మొత్తానికి నితిన్ 2020లో భీష్మ తో ఫస్ట్ హిట్ అందుకుంటారు అనిపిస్తుంది.
నితిన్ గత ఏడాది నటించిన ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు నిరాశపరిచాయి. ఆ మాటకొస్తే అ..ఆ తర్వాత నితిన్ కు సరైన సక్సెస్ లేదు. దీనితో నితిన్ భీష్మ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మణిశర్మ కుమారుడు సాగర్ మహతి స్వరాలు సమకూరుస్తున్నాడు.
భీష్మ కాకుండా ఇప్పటికే నితిన్ మరో రెండు సినిమాలు పట్టాలెక్కించాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే… చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చదరంగం అనే సినిమాలు ఇప్పటికే లూప్ లైన్ లో ఉన్నాయి. భీష్మ ఫిబ్రవరికి వాయిదా పడటంతో ఈ మూడు సినిమాలూ 2020లోనే విడుదల కానుండడం విశేషం.
NTR Arts: Terrified NTR Fans Can Relax!
TFI Supporters Of Jagan: Risked Careers, Got Cheated