పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “భీమ్లా నాయక్” బాక్సాఫీస్ వద్ద సందడి ముగిసి, బుల్లితెరను తాకనుంది. మరో మూడు రోజుల్లో రెండు ఓటీటీలలో ప్రత్యక్షం కానున్న “భీమ్లా నాయక్” సినిమా కోసం అభిమానులు నిరీక్షిస్తుండగా, లేటెస్ట్ గా “భీమ్లా నాయక్” టైటిల్ ను చిత్ర యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది.
నిజానికి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తొలుత రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్ ఇదే. ప్రేక్షకుల నుండి అపూర్వ స్పందన దక్కించుకోవడంతో, “భీమ్లా నాయక్”కు సర్వత్రా పాజిటివ్ స్పందనలు లభించాయి. ఆ తర్వాత రిలీజ్ అయిన పాటలు ఈ రేంజ్ లో ఆదరణకు గురి కాకపోయినా, సినిమాలో థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరోసారి హైలైట్ గా నిలిచింది.
లిరికల్ సాంగ్ తో అదరగొట్టిన “భీమ్లా నాయక్” టైటిల్ సాంగ్, ధియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మాత్రం ప్రేక్షకులను బెదరగొట్టింది. అభిమానులు కూడా ఈ పాట చిత్రీకరణపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా పవన్ నామస్మరణ చేసే హైపర్ అది వంటి వాళ్ళతో చేయించడం, ఏ మాత్రం సంబంధం లేని క్యారెక్టర్ లో సునీల్ ను పెట్టడం పాటకు మైనస్.
అలాగే ఈ పాటలో పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ మొదలుకుని, వేసిన స్టెప్పుల వరకు అన్ని బెడిసి కొట్టాయి. ఆడియో పరంగా ఇప్పటికీ అదిరిపోయేలా థమన్ సౌండింగ్ ఇవ్వగా, వీడియో పరంగా మెప్పించడానికి దర్శకుడు సాగర్ మాత్రం తగిన రీతిలో జాగ్రత్తలు తీసుకోలేదు. లిరికల్ సాంగ్స్ లో తొలుత ఈ పాటనే విడుదల చేయగా, వీడియో సాంగ్స్ లో కూడా ముందుగా ‘భీమ్లా’తోనే మొదలు పెట్టారు.