పవర్ స్టార్ అనే పేరే ఒక పండగ. అలాంటిది ఆయన సినిమా వస్తోందంటే డబల్ బొనాంజా. అందులోనూ రికార్డులు బద్దలుకొట్టే సినిమా అంటే ఆ ఎనర్జీ వేరు. అలాంటి గొప్ప అనుభూతిని తమ ప్రియమైన ఓటీటీ ప్రేక్షకులకు అందించబోతోంది “డిస్నీప్లస్ హాట్ స్టార్”.
ఈ సీజన్ కి ఒక అతి పెద్ద ఓటీటీ సంచలనాన్ని సిద్ధం చేసింది. దాని పేరు “భీమ్లా నాయక్”. పవర్ స్టార్ ఇమేజ్ కి ఆకాశమే హద్దు అని మరోసారి నిరూపించిన సినిమా ఇది. అభిమానుల అంచనాలను అందుకుంటూనే అంతకంటేఎక్కువ స్థాయిలో పవర్ స్టార్ ని నిలబెట్టిన సినిమా ఇది. బీమ్లా నాయక్ ని ఢీకొనే పాత్రలో యువ కథానాయకుడు రానా తనలోని నటుడిని కొత్తగా ఆవిష్కరించిన సినిమా ఇది.
Also Read – మందు బాబులకే కాదు మద్యం వ్యాపారులకు…
పవర్ ఫుల్ సంభాషణలు రాయడంలో.. ప్రతి మాటకీ విజిల్స్కొట్టించడంలో దిట్ట… డైలాగుల పుట్ట త్రివిక్రమ్ రచన ఈ సినిమాకి వెన్నెముక. తమన్ సంగీతం ఎంత సంచలనమే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక విభిన్నమైన కథ కి అద్భుతమైన స్టార్స్ వచ్చి చేరితే.. వాళ్లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉంటే .. ఇక అది”భీమ్లా నాయక్” అవ్వక ఇంకేమవుతుంది.
“డిస్నీ ప్లస్ హాట్ స్టార్”మార్చి 25 నుంచి “భీమ్లా నాయక్” స్ట్రీమింగ్ ప్రారంభం అవుతుంది. ఆ రోజు అర్ధరాత్రి నుంచి “భీమ్లా నాయక్” సందడి మొదలవుతుంది. “భీమ్లా నాయక్” గ్రాండ్ గాలా ప్రారంభంఅవుతుంది. అది అలా కొనసాగుతుంది. చూడండి. చూడడం మర్చిపోకండి.
Also Read – జోగి అండ్ సన్స్: ఒకరు సుప్రీంకోర్టులో మరొకరు హైకోర్టులో!
బ్లాక్ బస్టర్ “భీమ్లా నాయక్” “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
Also Read – ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామాలు అవసరమేగా?
Content Produced by: Indian Clicks, LLC