Bhavana Shocked with Dileep arrestమలయాళ స్టార్ హీరో దిలీప్‌ అరెస్టుతో అందరి లాగానే తాను కూడా షాక్‌ కి గురయ్యానని హీరోయిన్ భావన తెలిపింది. కేసు పురోగతి నేపథ్యంలో ఓ ప్రకటన విడుదల చేసిన భావన… దిలీప్‌ పేరును ప్రస్తావించకుండా… పోలీసులు అరెస్టు చేసిన హీరోతో తాను చాలా సినిమాల్లో పని చేశానని గుర్తు చేసుకుంది. ఆయనతో తనకు ఎలాంటి రియల్‌ ఎస్టేట్‌, ఆర్థిక వ్యవహారాలు లేవని తెలిపింది.

కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగానే తమ మధ్య స్నేహ బంధం ముగిసిపోయిందని తెలిపింది. అరెస్టు అనంతరం దిలీప్‌ చెబుతున్నట్టు… ఆయన నేరం చేసి ఉండకపోతే నిజం తప్పకుండా బయట కొస్తుందని, ఈ కేసులో వాస్తవాలు త్వరగా బయటకు రావాలని, దోషులు తప్పించుకోకూడదని పేర్కొంది. అదే సమయంలో అమాయకులు శిక్షకు గురికాకూడదని చెప్పింది.

ఫిబ్రవరిలో భావనపై జరిగిన లైంగక దాడి అనంతరం పోలీసులు ఆమె పేరును అధికారికంగా వెల్లడించకుండా, ‘ఒక మలయాళ నటి’ అని మాత్రమే పేర్కొన్నారు. అయితే ఆమె పేరును సోషల్‌ మీడియా ద్వారా నటుడు అజు వర్ఘీస్‌ ఉద్దేశపూర్వకంగా వెల్లడించాడు. దీంతో లైంగిక దాడి బాధితురాలి పేరును వెల్లడించిన నేరానికి గాను అతనిపై ఐపీసీ సెక్షన్‌ 228(ఏ) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.