ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ సెన్సేషన్ “భరత్ అనే నేను” ప్రమోషన్ కార్యక్రమాలు అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ‘బ్రహ్మోత్సవం, స్పైడర్’ సినిమాల ద్వారా జరిగిన లోటును ‘భరత్ అనే నేను’ పూడ్చే విధంగా జరుగుతోన్న హంగామాతో ప్రిన్స్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

శనివారం సాయంత్రం జరగబోతోన్న ఈ సినిమా ఆడియో వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేయబోతున్నారని ధృవీకరించిన చిత్ర యూనిట్, సరిగ్గా రాత్రి 12 గంటలకు చేరుకునే పాటికి ‘భరత్ బహిరంగ సభ’ పేరుతో ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

‘వచ్చాడయ్యో సామి’ పాటకు సంబంధించిన ఈ పోస్టర్ లో నాగలి పట్టుకున్న ప్రిన్స్ పంచె కట్టు స్టైల్ చూసి ఫిదా అవ్వడం ఫ్యాన్స్ వంతవుతోంది. కొరటాల మాస్ కోణంలో ప్రిన్స్ ను చూస్తున్న ఫ్యాన్స్ కు ‘వచ్చాడయ్యో సామి’ పాట ఓ క్లాసిక్ గా మిగిలిపోతుందన్న సంకేతాలు ఈ పోస్టర్లు ఇస్తున్నాయి.bharata Ane Nenu Posters -1

bharata Ane Nenu Posters -1