Bharat-Ane-Nenu-US-Collectionsబాక్సాఫీస్ వద్ద ప్రిన్స్ ప్రభంజనం మొదలైంది. తొలి రోజు అద్భుతమైన వసూళ్ళను సాధించిన ‘భరత్ అనే నేను’ వీకెండ్ వరకు అడ్వాన్స్ ఫుల్స్ తో రన్ అవుతున్నాయి. అంటే ఈ మూడు రోజుల్లో రికార్డ్ రెవిన్యూ ‘భరత్ అనే నేను’ సొంతం కావడం ఖాయం. ఇంతకీ ఫస్ట్ డే ఎంత కొట్టింది? అన్న విషయం మరికొద్ది గంటల్లో వస్తుంది గానీ, ఓవరాల్ గా అన్ని ఏరియాలలో ‘నాన్ బాహుబలి’ రికార్డులు ఖాయం అన్న టాక్ ట్రేడ్ వర్గాల నుండి వినపడుతోంది.

మొదటగా ఓవర్సీస్ నుండి మొదలుపెడితే, ఇటీవలే ‘రంగస్థలం’ 3 మిలియన్ క్లబ్ లోకి చేరి టాప్ 3గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ రికార్డును బద్దలు కొట్టడం మహేష్ బాబుకు కేక్ వాక్ లాంటిదని చెప్పవచ్చు. అంతేకాదు ఓవరాల్ గా 4 మిలియన్ క్లబ్ లో ‘భరత్ అనే నేను’ ఖచ్చితంగా చేరనుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఆ పైన ఎంత వసూలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అలాగే చెన్నైలో ఇప్పటికే ‘రంగస్థలం’ రికార్డులను కొట్టగా, మహేష్ కున్న మార్కెట్ తో ఓవరాల్ గా కూడా ‘నాన్ బాహుబలి’ రికార్డులు అవలీలగా చేరుకుంటుందని చెప్పవచ్చు.

ఇక లోకల్ మార్కెట్ కు వచ్చేసరికి, తొలిరోజు కృష్ణా, గుంటూరు వంటి ఏరియాలలో ఏకంగా ‘నాన్ బాహుబలి 2’ రికార్డులను కొల్లగొట్టింది. అంటే ‘బాహుబలి 1’ రికార్డులు మటుమాయం అయిపోయాయి. మిగిలిన ఏరియాలలోనూ వసూళ్లు రికార్డు స్థాయిలోనే ఉన్నాయి. ఈ మూడు రోజుల్లో రాబట్టిన వసూళ్ళను బట్టి “భరత్ అనే నేను” రేంజ్ ఏంటో స్పష్టంగా తెలియనుంది. మహేష్ సినిమాలకు లాంగ్ రన్ ఉంటుంది గనుక, అది ఓ 2 వారాల పాటు కొనసాగినా ‘బాహుబలి 1’ రికార్డులను అధిగమించడం కొరటాల – మహేష్ బాబు కాంబోకు కష్టమేమీ కాదు.