What-Did-'Bharat-Ane-Nenu'-Do-to-Kiara-Advaniప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లో భారీ విజయంగా నమోదు చేసుకున్న “భరత్ అనే నేను” సినిమా ఇంకా ధియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. నాలుగవ వారంలోకి ప్రవేశించిన ఈ సినిమా ఇప్పటికీ కొన్ని ఏరియాలలో మంచి కలెక్షన్స్ ను సాధిస్తుండగా, మరో పక్కన మీడియాలో ప్రమోషన్స్ కూడా కొనసాగుతున్నాయి.

ఈ తరుణంలో ‘భరత్ అనే నేను’ ఆల్బమ్ లో ఉన్న ఏకైక డ్యూయెట్ సాంగ్ ‘ఓ వసుమతి’ని యూ ట్యూబ్ లో చిత్ర యూనిట్ విడుదల చేసింది. మహేష్ – కైరా అద్వానీలు జంటగా కనువిందు చేసిన ఈ పాటను ముందుగా టీవీ9 ఛానల్ లో మధ్యాహ్నం వేళలో ప్రత్యేకంగా విడుదల చేయగా, సాయంత్రానికి యూ ట్యూబ్ లో ప్రత్యక్షమైంది.

దీంతో ఈ పాటను వీక్షిస్తూ పండగ చేసుకోవడం ప్రిన్స్ ఫ్యాన్స్ వంతవుతోంది. ఇటీవల కాలంలో సినిమా విడుదలైన ఓ నెల రోజులకే అమెజాన్ ప్రైమ్ ద్వారా మొత్తం సినిమా విడుదల అవుతున్న నేపధ్యంలో… అంతకంటే ముందుగానే వీడియో సాంగ్స్ ను యూ ట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ‘రంగస్థలం’ నుండి నాలుగు పాటలు విడుదలైన విషయం తెలిసిందే.