bharat-ane-nenu-movie-television-premiereఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన “రంగస్థలం” సినిమాతో పోటీపడిన “భరత్ అనే నేను” కలెక్షన్ల పరంగా అధిగమించలేకపోయింది. చెర్రీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలువగా, ప్రిన్స్ మూవీ సూపర్ హిట్ తో సరిపెట్టుకుంది. అయినా ప్రిన్స్ అభిమానులను సంతృప్తి పరిచిన సినిమాగా “భరత్ అనే నేను” నిలిచింది.

తాజాగా ఈ సినిమా బుల్లితెరపై మరికొద్ది గంటల్లో ప్రదర్శితం కానుంది. దీంతో అందరి కళ్ళు ఈ సినిమా టీఆర్పీ రేటింగ్స్ పైకి మళ్ళాయి. ఇటీవలే “రంగస్థలం” సినిమా బుల్లితెరపై ప్రదర్శితం కాగా, రికార్డు స్థాయిలో 19.5 టీఆర్పీని సొంతం చేసుకుని రామ్ చరణ్ అదరగొట్టాడు. మరి అదే స్థాయిలో రేటింగ్స్ ను ప్రిన్స్ సొంతం చేసుకోగలరా? అన్నది ఆసక్తికరంగా మారింది.

నిజానికి రామ్ చరణ్ తో పోలిస్తే బుల్లితెరపై మహేష్ సినిమాలకు ఎక్కువ ప్రేక్షకాధరణ ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో నెల రోజులకే అమెజాన్ ప్రైమ్ రూపంలో డిజిటల్ ప్రింట్స్ వచ్చేస్తుండడంతో టీఆర్పీ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో ‘రంగస్థలం’కు వచ్చిన రేటింగ్స్ అద్వితీయంగా నిలిచాయి. మరి ఆ స్థాయిలో ‘భరత్ అనే నేను’కు ప్రేక్షకులు పట్టం కడతారో లేదో చూడాలి.