Mahesh-Babuప్రిన్స్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న “భరత్ అనే నేను” సినిమా విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ నెల 19వ తేదీన యుఎస్ లో భారీ ఎత్తున ప్రీమియర్స్ తో “భరత్ అనే నేను” విడుదల కాబోతోంది. అలాగే ఏపీ, తెలంగాణాలలో 20వ తేదీ తెల్లవారుజాము నుండి ప్రత్యేక షోల ప్రదర్శనకు రంగం సిద్ధమవుతోంది.

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోలు, టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ పాజిటివ్ వైబ్స్ ను కలిగించడంతో పాటు ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ బాబు ఎలా కనిపించబోతున్నాడనేది అభిమానులనే కాక, సాధారణ సినీ ప్రేక్షకులను కూడా ఉత్సాహపరుస్తోంది. మరో పక్కన ఏపీ, తెలంగాణాలలోని అన్ని ప్రముఖ పట్టణాలన్నీ ‘భరత్ అనే నేను’ పోస్టర్స్ తో నిండిపోతున్నాయి.

ఇదిలా ఉంటే, శుక్రవారం నాడు విడుదల చేసిన ‘ఓ వసుమతి’ వీడియో సాంగ్ ప్రోమోలో మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కాస్త డిఫరెంట్ గా ఉండడం విశేషం. ఇప్పటివరకు పాటలలో మహేష్ ఎక్కువగా మెడను కదిలించే వారు కాదు, కానీ ఈ పాటలో మాత్రం మెడను కదిలిస్తూ సరికొత్త బాడీ లాంగ్వేజ్ లో కనిపించడం ఫ్యాన్స్ కు నూతన ఉత్సాహాన్ని కలిగిస్తోంది. రిలీజ్ లోపు మరో పాట కూడా ఫ్యాన్స్ కోసం ప్రేక్షకుల ముందుకు రావచ్చు.