Three-Exclusive-Mahesh-Babu-Sentiments-–-What-Will-Bharat-Ane-Nenu-Breakరాజకీయాలు అనేవి తనకు సంబంధించినంత వరకు సినిమాల వరకే పరిమితం గానీ, వాటి జోలికి ఎప్పటికీ వెళ్లనని మరోసారి స్పష్టం చేసిన ప్రిన్స్ మహేష్ బాబు, ‘భరత్ అనే నేను’ స్క్రిప్ట్ వలన రాజకీయాలపై ఆసక్తి అయితే పెరిగిందని చెప్పుకొచ్చారు. సెట్స్ లో శివ గారు చెప్తుంటే… ఇవన్నీ నిజంగా బయట జరుగుతాయా? అని స్కూల్ టీచర్ ను స్టూడెంట్ ప్రశ్నించే మాదిరి అడిగేవాడినని, ఆయన సేకరించిన సమాచారం అంతా తనకు విపులంగా వివరించే వారని, దీంతో రాజకీయాలపై గౌరవం పెరిగిందని తెలిపారు.

ఇంతకుముందు పేపర్ లో స్పోర్ట్స్ కాలం ఒక్కటే చదివేవాడ్నని, కానీ ఇప్పుడు ఫ్రంట్ పేజీ కూడా చదవాలనిపిస్తోందని తనలో ఉన్న రాజకీయాలపై మార్పును ఒక్క మాటలో వివరించారు ప్రిన్స్. ఈ సినిమాలో వాడిన ‘మేడమ్ స్పీకర్’ అనే డైలాగ్ ను తన బావ పార్లమెంట్ లో వినియోగించిన ‘మేడమ్’ నుండి స్ఫూర్తి పొందానని, అసెంబ్లీలో సన్నివేశాల కోసం ఆయన వీడియోలే కొన్ని చూశానని ఈ సందర్భంగా ప్రిన్స్ చెప్పుకొచ్చారు. ఒకప్పుడు పోలిటిక్స్ అన్న పేరు ఎత్తితేనే ముఖం తప్పకునే మహేష్, ఇప్పుడు రాజకీయాల గురించి చాలా విషయాలు అనర్గళంగా మాట్లాడుతుండడం విశేషం.