Bharat-Ane-Nenu---Mahesh-Babuప్రిన్స్ మహేష్ బాబు గత చిత్రం ‘స్పైడర్’తో పోలిస్తే… ‘భరత్ అనే నేను’ ప్రమోషన్స్ పక్కా ప్లానింగ్ తో జరుగుతున్నాయి. ఏప్రిల్ 20వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఉగాది నుండి మొదలై, నిరంతరాయంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఓ పక్కన పోస్టర్స్ మరో పక్కన పాటలతో కొనసాగుతున్న పబ్లిసిటీ, గురువారం నాడు కీలక మలుపు తిరగబోతోంది.

ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలలో… మొదటిది ‘ది సాంగ్ ఆఫ్ భరత్’ చిత్రం థీమ్ ను తెలిపే పాటగా ప్రేక్షకుల చేత ‘ఓకే’ మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత ‘ఐ డోంట్ నో’ అనేది పెప్పీ సాంగ్ గా పర్లేదు అనిపించుకుంది గానీ, ఫ్యాన్స్ కు కావాల్సిన ఊపును అయితే ఇవ్వలేకపోయింది. దీంతో అభిమానుల ఆశలన్నీ ‘వచ్చాడయ్యో సామి’ పైనే పెట్టుకున్నారు.

గతంలో ఈ పాటకు సంబంధించిన ఒక చిన్న బిట్ దేవి ద్వారా సోషల్ మీడియాలో బయటకు రాగా, ఆ చిన్న బిట్ విపరీతమైన సందడి చేసింది. అందులోనూ కొరటాల సినిమాలలో బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘వచ్చాడయ్యో సామి’ పాట అంచనాలను అందుకుంటే ‘భరత్ అనే నేను’కు మాంచి బూస్టింగ్ లభిస్తుంది, లేదంటే బజ్ తగ్గే ప్రమాదం కూడా పొంచి ఉంది.