Mahesh-Babuధియేటర్ కు వచ్చిన తర్వాత ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేద్దామనే ఉద్దేశంతో… ప్రమోషనల్ లో ఒకటి చెప్పి, సినిమాలో ఒకటి చూపిస్తుంటే… రిలీజ్ తర్వాత ఆయా చిత్ర యూనిట్స్ కు షాక్ ఇచ్చే విధంగా తీర్పులు ఇవ్వడం సినీ ప్రేక్షకుల వంతవుతోంది. బహుశా దీని నుండి మహేష్ బాబు తాజా చిత్ర యూనిట్ కు జ్ఞానోదయం అయినట్లుంది. దీంతో మహేష్ గత చిత్రం ‘స్పైడర్’ మాదిరి కాకుండా, ఈ సినిమాలో తాము ఎం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఫస్ట్ పోస్టర్ రిలీజ్ కు ముందే స్పష్టంగా చెప్పేశారు.

మరికొద్ది గంటల్లో ముఖ్యమంత్రిగా మహేష్ బాబు ప్రమాణ స్వీకార స్వరం వినిపించనున్న నేపధ్యంలో… అంతకు 12 గంటల ముందే కొరటాల శివ ట్విట్టర్ ద్వారా తన స్వరాన్ని వినిపించారు. ఈ సినిమా కధ అవిచ్చిన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగే పొలిటికల్ డ్రామా అని స్పష్టం చేయడంతో అభిమానులు ఏవేవో ఊహించుకోవడానికి ఆస్కారం లేకుండా చెప్పినట్లయ్యింది. దీంతో ప్రొడక్షన్ యూనిట్ డివివి ఎంటర్టైన్మెంట్స్ తో పాటు కొరటాల శివకు కూడా కృతజ్ఞతలు చెప్పడం ప్రిన్స్ ఫ్యాన్స్ వంతవుతోంది.