Bharat Ane Nenu in 3 minutes-సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించి ఏదొకటి రిలీజ్ చేయడం ప్రిన్స్ మహేష్ బాబు ప్రతి ఏడాది అవలంబించే విషయం. అయితే ఈ సారి ‘భరత్ అనే నేను’ సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యి ఉండడంతో, ఎలాంటి సర్ ప్రైజ్ లు రావని అనుకున్న నేపధ్యంలో… “భరత్ అనే నేను” సినిమాను క్లుప్తంగా ఓ మూడు నిముషాల్లో కట్ చేసి స్పెషల్ ట్రైలర్ ను వదిలారు.

కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అర్దరాత్రి 12 గంటలకు ఈ మూడు నిముషాల నిడివి గల ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ‘భరత్ అనే నేను’ థీమ్ సాంగ్ తో మొదలైన ఈ ట్రైలర్ లో సినిమాలోని హైలైట్ షాట్స్ అయిన అసెంబ్లీ సీన్స్, ప్రకాష్ రాజ్ తో సీన్స్, ఎడ్యుకేషన్ సీన్స్, హెలికాఫ్టర్ సీన్ వంటివి కట్ చేసారు. సింపుల్ గా చెప్పాలంటే ‘భరత్ అనే నేను’ సినిమాను ఓ 3 నిముషాల్లో చూపించే ప్రయత్నం చేసారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా తమిళ, మలయాళ భాషలలో ఇదే రోజున విడుదల అవుతోంది. తమిళంలో బాగానే రిలీజ్ అవుతోన్న ఈ సినిమా, మలయాళంలో లిమిటెడ్ సెంటర్స్ లో రిలీజ్ అవుతోంది. గతంలో మహేష్ ‘1 నేనొక్కడినే’ సినిమా మలయాళంలోకి డబ్ అయ్యి పర్వాలేదనిపించే విధంగా ఆడింది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ‘భరత్ అనే నేను’ కేరళ ప్రేక్షకులను పలకరించబోతోంది.