mahesh-babu-bharat-ane-nenuదాదాపుగా అయిదు గంటల నిడివి గల స్టోరీలో మొత్తం సన్నివేశాలను ఎలా పెడతారు? అంటూ మహేష్ బాబు దర్శకుడు కొరటాలకు వేసిన ప్రశ్న తర్వాత, చాలా సన్నివేశాలను షూటింగ్ దశలోనే ఎడిట్ చేసామని, మరికొన్ని సీన్స్ ను చిత్రీకరించిన తర్వాత లెంగ్త్ ఇబ్బందితో కట్ చేసామని దర్శకుడు కొరటాల శివ చెప్పిన విషయం తెలిసిందే.

ఇందులో భరత్ తమ్ముడు వలన వచ్చే హోలీ ఫైట్ డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో చెప్పగా, ఓ ఈవ్ టీజింగ్ సీన్ గురించి ప్రొడక్షన్ యూనిట్ రిలీజ్ చేసిన తాజా ఇంటర్వ్యూలో మహేష్ బాబు రివీల్ చేసారు. మహేష్ చాలా సింపుల్ గానే చెప్పినప్పటికీ, కొరటాల తన టేకింగ్ లో ఆ సింపుల్ సీన్ ను బాగా ఎలివేట్ చేసుంటారని చెప్పొచ్చు.

ఈవ్ టీజ్ చేస్తోన్న ఓ యువకుడ్ని పోలీసులు సెక్రటేరియట్ కు తీసుకువస్తారని, అతనికి కాఫీ కూడా ఇస్తారని, ఆ సమయంలో ఈవ్ టీజ్ చేసిన యువకుడు చేతులు వణికిపోతూ భయపదిపోతూ ఉంటాడని, ఆ తర్వాత సిఎం వచ్చి ఈవ్ టీజింగ్ చేస్తావా? అంటే చేయను అని చెప్తాడని… మహేష్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.