How-Holi-Fight-Was-Connected-in--Bharat-Ane-Nenuప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా అవతరించిన “భరత్ అనే నేను” సినిమాకు మరో అదనపు హంగు చేరబోతోంది. ఈ సినిమా ఎడిటింగ్ లో భాగంగా మంచి సన్నివేశాలతో పాటు హోలీ నేపధ్యంలో చిత్రీకరించిన ఓ ఫైట్ ను కూడా తీసివేసామని దర్శకుడు కొరటాల శివ తెలిపిన విషయం తెలిసిందే. అయితే వీటిని యూ ట్యూబ్ లో విడుదల చేయాలా? లేక ధియేటర్లలో ప్రదర్శితమవుతోన్న సినిమాకు జోడించాలా? అన్న విషయంపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని తన ఇంటర్వ్యూలలో కొరటాల శివ చెప్పుకొచ్చారు.

అయితే దీనిపై ఓ నిర్ణయం తీసుకున్న ప్రొడక్షన్ యూనిట్, ఈ నెల 4వ తేదీ నుండి ఈ ఫైట్ యాడ్ చేసేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ రిలీజ్ రోజున మహేష్ ఫ్యాన్స్ కు ట్రీట్ గా మారనుందన్న మాట. అభిమానులను మళ్ళీ ధియేటర్లకు రప్పించడంలో ఈ హోలీ ఫైట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. బొమ్మ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ కొట్టిన తర్వాత, మరికొన్ని సీన్లను జోడించడం కొరటాల శివ సినిమాలకు పరిపాటిగా మారిపోయిన విషయం సినీ జనులకు కొత్తేమీ కాదు.