Bharat Ane Nenu Assembly Uncut Scenes‘భరత్ అనే నేను’ సినిమాలో నిడివి ఇబ్బందితో కట్ చేసిన సన్నివేశాలను సిల్వర్ స్క్రీన్ పై చూపిస్తారని భావించిన ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు షాక్ తగిలింది. సినిమాకు ఎడిట్ చేసిన సీన్స్ లో ఓ మూడింటిని శుక్రవారం నాడు విడుదల చేయగా, శనివారం నాడు మరికొన్ని సన్నివేశాలను విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది.

ఇక విడుదల చేసిన సీన్స్ బాగున్నాయని, ఇవి ఖచ్చితంగా సినిమాలో ఉండాల్సిన సీన్స్ అంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ లేకుండానే పవర్ ఫుల్ గా కనపడుతోన్న ఈ సీన్స్ కు దేవి సంగీతం తోడయితే ప్రేక్షకులను మరింతగా రంజింప చేసే విధంగా ఉండడం ఖాయమన్నది వీక్షకులు చెప్తోన్న మరో అంశం. ఈ కోవలోనే మరిన్ని ఆసక్తికరమైన సీన్స్ విడుదల కానుండడం ఈ వీకెండ్ లో ప్రిన్స్ ఫ్యాన్స్ నూతన ఉత్సాహాన్నిస్తోంది.

ఇదిలా ఉంటే శుక్రవారం నుండి ధియేటర్స్ లో ఉంటుందని భావించిన ‘హోలీ ఫైట్’ కూడా ధియేటర్లలో ప్రత్యక్షం కాకపోవడం ప్రిన్స్ ఫ్యాన్స్ కు మరో షాక్. బహుశా దీనిని కూడా యూ ట్యూబ్ ద్వారా పరిచయం చేస్తారో లేక సిల్వర్ స్క్రీన్ పై చూపిస్తారో గానీ, నిజంగానే ‘భరత్ అనే నేను’ను రెండు పార్టులుగా తీస్తే ఇలాంటి మరిన్ని మంచి సీన్స్ చూసేవాళ్ళమన్న ఫీలింగ్ ప్రిన్స్ ఫ్యాన్స్ ది. అభిమానం కదా అలాగే ఉంటుందిలేండి!