Bharat Ane Nenu -50 Daysప్రస్తుత రోజుల్లో ఓ సినిమా 50 రోజుల పాటు ధియేటర్లలో ప్రదర్శితం అవ్వడం అంటే చాలా గొప్ప విషయం. ఇటీవలే ‘రంగస్థలం’ ఆ ఫీట్ ను పూర్తి చేయగా, తాజాగా ‘భరత్ అనే నేను’ అదే కోవలో పయనిస్తోంది. జూన్ 9వ తేదీతో 50 రోజులు పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమా, ఆ రోజున డిజిటల్ మీడియా ద్వారా విడుదలకు నోచుకోబోతోంది. అవును… జూన్ 9వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ సినిమాను ప్రేక్షకులు వీక్షించవచ్చు.

డిజిటల్ మీడియా అనేది నిర్మాతలకు ఓ వరంలా మారడంతో, అత్యధిక రేట్లతో క్రేజీ ప్రాజెక్ట్స్ ను సొంతం చేసుకుంటున్నారు. దీంతో ఆయా హీరోల స్థాయిని బట్టి, సినిమా ఫలితాలను బట్టి 30 నుండి 50 రోజుల లోపే తదితర మాధ్యమాల ద్వారా రిలీజ్ చేసేస్తున్నారు. నాని ‘ఎంసీఏ’ అయితే ధియేటర్లలో దిగ్విజయంగా ప్రదర్శింపబడుతున్న సమయంలోనే రిలీజ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలా రిలీజ్ అయిన సినిమాలు కూడా మరుక్షణమే పైరసీ వెబ్ సైట్స్ లో ప్రత్యక్షం అవుతున్న వైనం విదితమే.