Bharat ane Nenu 50 Days- Posterప్రస్తుత రోజుల్లో ఓ సినిమా 50 రోజుల పాటు ప్రదర్శితం అవ్వడం అంటే సాధారణ విషయం కాదు. దానిని ‘రంగస్థలం’ దిగ్విజయంగా అందుకోగా, తాజాగా ‘భరత్ అనే నేను’ కూడా అదే బాటలో పయనించి, 50 రోజులను పూర్తి చేసుకుంది. ముఖ్యంగా ఈ విజయంతో ప్రిన్స్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ‘బ్రహ్మోత్సవం, స్పైడర్’ వంటి డిజాస్టర్ సినిమాలతో కలత చెందిన అభిమానులను సంతృప్తి పరచడంలో ‘భరత్ అనే నేను’ సక్సెస్ కావడంతో, ఈ 50 రోజులను ఘనంగా జరుపుకుంటున్నారు.

ఇక రేపటి నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుండడంతో… దాదాపుగా ‘భరత్ అనే నేను’ ముగింపు దశకు చేరుకున్నట్లే! ప్రైమ్ ద్వారా రిలీజ్ అయిన సినిమాలు మరుక్షణమే పైరసీ వెబ్ సైట్స్ లో లభిస్తుండడంతో హెచ్.డి క్వాలిటీతో కూడిన సినిమాలు నెటిజన్లకు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. మహేష్ కూడా ‘భరత్ అనే నేను’ నుండి బయటకు వచ్చి, తన తదుపరి సినిమా షూటింగ్ కోసం సన్నద్ధం అవుతున్నారు. మరో మూడు రోజుల్లో వంశీ పైడిపల్లి సినిమా తొలి షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది.