here-why-bharat-ane-nenu-runtime-is-not-an-issueఏప్రిల్ 20వ తేదీ ఎప్పుడు వస్తుందా… ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోను వెండితెరపై చూద్దామా… అని ప్రిన్స్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. రిలీజ్ కు సంబంధించిన అన్ని కార్యక్రమాలను చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటికే పూర్తి చేసింది. ఓవర్సీస్ ప్రీమియర్స్ కు సంబంధించిన హార్డ్ డిస్క్ లు ఇప్పటికే చేరుకున్నాయని అక్కడ పంపిణీదారులు స్పష్టం చేయగా, స్థానికంగా ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలో వేకువజామున షోలకు సర్వం సిద్ధమవుతోంది.

అయితే ఇంతలోనే ప్రిన్స్ అభిమానులను ఓ అంశం కలవరపెట్టింది. అంతటా రిలీజ్ సిద్ధమైన ‘భరత్ అనే నేను’ పొరుగున ఉన్న చెన్నైలో మాత్రం విడుదలపై సందిగ్ధత ఏర్పడింది. స్ట్రైక్ రీత్యా ‘భరత్ అనే నేను’ చెన్నైలో విడుదల కాదేమోనని సోషల్ మీడియా వేదికగా ఓ ట్రెండ్ కూడా సృష్టించారు. అయితే మంగళవారం రాత్రి సమయానికి స్ట్రైక్ ముగిసిందన్న ఓ తీపికబురు రావడంతో, ‘భరత్ అనే నేను’ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.

చెన్నైలో మహేష్ కు మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందులోనూ కొరటాల కాంబోలో వస్తోన్న ‘భరత్ అనే నేను’పై ఉన్న పాజిటివ్ వైబ్ తో చెన్నైలో ఈ సినిమా కనకవర్షం కురిపిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. దీనికి తోడు ఇటీవల విడుదలైన ‘రంగస్థలం’ చెన్నైలో మంచి వసూళ్లు అందుకోవడంతో, మార్కెట్ ఉన్న మహేష్ మూవీ కూడా రికార్డులు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.