bhanu-rao-dance-at-922015 డిసెంబర్ 4 నాటికి 92 ఏటలోకి అడుగుపెట్టిన ఈ బామ్మ పేరు భానుమతీ రావ్‌. ఈ వయసు రీత్యా సహజంగా ఎదురయ్యే వినికిడి లోపం, దృష్టి లోపం వంటి శారీరక బాధలను పట్టించుకోకుండా బెంగుళూరులో స్కూల్ స్టేజి మీద అలవోకగా “భరతనాట్యం” ప్రదర్శన ఇచ్చారు.

వయసు అనేది శరీరానికే కానీ మనసుకు కాదని మరోసారి ఈ బామ్మ ద్వారా నిరూపితమైంది. తన నృత్యంతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ బామ్మ విన్యాసాలు చూసిన ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తున్నాయి. గతంలో పూర్వాశ్రమంలో రామ్‌గోపాల్ ట్రూప్‌లో డ్యాన్సర్‌గా వున్న సమయంలో యుద్ధ బాధితుల సహాయనిధి కోసం విదేశాల్లో ప్రదర్శనలిచ్చారు. అలాగే నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూడా ఈమె భరతనాట్య ప్రదర్శనను తిలకించారు.

భానుమతీరావ్ కుమార్తె మాయా కృష్ణారావ్ ఈ వీడియోను యూ ట్యూబ్ లోకి అప్ లోడ్ చేసారు. మరో విశేషమేమిటంటే… సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్న ఈ వీడియోను దృష్టి లోపం కారణంగా భానుమతీరావ్ గారే చూసుకోలేరు. చిన్న చిన్న కార్యాలు చేయడానికి సవా లక్ష కారణాలు చెప్పే నేటి యువత ఈ వీడియోను వీక్షించిన తర్వాత ఏమంటారో..!