Bhale-Manchi-Roju-public-talk‘ప్రేమకధా చిత్రమ్’ తర్వాత సరైన సక్సెస్ లేక ఆపసోపాలు పడ్డ ప్రిన్స్ మహేష్ బాబు బావ సుధీర్ బాబు నిరీక్షణ ఫలించినట్లే కనపడుతోంది. యువ దర్శకుడు శ్రీరాం ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ‘సూపర్ హిట్’ టాక్ ను సొంతం చేసుకుంది. వాస్తవానికి ఒక రోజు ముందే హైదరాబాద్ లో శ్రీరాములు దియేటర్లో ప్రదర్శితమైన ప్రీమియర్ షోతో “భలే మంచి రోజు” సినిమా టాక్ సోషల్ మీడియా వేదికగా క్షణాల్లో పాకిపోయింది.

ఒక్క రోజులో ముగిసిపోయే కధగా తెరకెక్కిన “భలే మంచి రోజు”లో ఫస్టాఫ్ అంతా ఎంటర్ టైన్మెంట్ తో సాగుతూ ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ బ్లాక్ తో ముగుస్తుందని, అలాగే సెకండాఫ్ లో ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీ మరోసారి తన తడాఖా చూపించారని, ముఖ్యంగా క్లైమాక్స్ కు ముందు పృథ్వీ చేసే కామెడీ ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వులు పంచుతోందని… మొత్తమ్మీద “భలే మంచి రోజు” ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ తో అలరిస్తుందనే టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమా విడుదలకు ముందు హీరో సుధీర్ బాబు ఇచ్చిన ప్రమోషన్ ఇంటర్వ్యూ లో… “ఈ సినిమా నచ్చకపోతే తానూ నటించే సినిమాలేవీ చూడవద్దని” ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పారో “భలే మంచి రోజు” సినిమా చూస్తే అర్ధమవుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.