Bhairava-Geetha-RGV-Promotionsనందమూరి హరికృష్ణ మరణంతో టాలీవుడ్ మొత్తం నిర్ఘాంతపోయిన వేళ, రాంగోపాల్ వర్మ మాత్రం తనదైన శైలిలో సినిమా ప్రమోషన్ కు శ్రీకారం చుట్టారు. గత కొన్ని రోజులుగా ట్వీట్స్ చేయని వర్మ, తాను నిర్మిస్తోన్న తాజా చిత్రం “భైరవగీత” గురించి వరుసగా ట్వీట్స్ చేసారు. అందరిదీ ఓ దారయితే… తనది మాత్రం మరోదారి… అని నిరూపించుకునే వర్మ, ఈ సారి కూడా అదే రూట్ ను ఫాలో అయ్యాడు.

సిద్ధార్ధ దర్శకత్వం వహిస్తోన్న “భైరవగీత” ట్రైలర్ ను సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేయబోతున్నామని, తన కెరీర్ మొత్తంలోనే సిద్ధార్థ అంత టాలెంట్ దర్శకుడిని చూడలేదని, అతన్ని ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నందుకు గర్విస్తున్నానని వర్మ తెలిపారు. సినిమాలో విజువల్స్ అండ్ ప్రతి క్యారెక్టర్ ను చూపించిన విధానం అద్భుతంగా ఉందని, ట్రైలర్ అదిరిపోతుందని చెప్పుకొచ్చారు.