Bhairava Geethaఉన్నత కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి… అట్టడుగు వర్గానికి చెందిన అబ్బాయి… వీరిద్దరూ ప్రేమించుకుంటే ఏమవుతుందో… లేటెస్ట్ “ఆర్ఎక్స్ 100” నుండి బోలెడు సినిమాలు ప్రేక్షకులు చూసి ఉన్నారు. అయితే అదే కాన్సెప్ట్ కాస్త డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తే కనవర్షం ఎలా కురుస్తుందో, తాజాగా ‘ఆర్ఎక్స్ 100’ నిరూపించగా, అదే కోవలో వర్మ ‘భైరవగీత’ నిలుస్తున్నట్లుగా ఉంది.

ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ధియేటిరికల్ ట్రైలర్ ‘ఆర్ఎక్స్ 100’కు సీక్వెల్ గా కనపడుతోంది. ‘రా అండ్ రియలిస్టిక్’గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ లో… సహజంగా వర్మ సినిమాలలో ఉండే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా కధలో కొత్తదనం లేకపోయినా, టేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కట్ చేసారు.

అయితే అవన్నీ వర్మ గత చిత్రాలు ‘రక్తచరిత్ర అండ్ కో’లను గుర్తు చేయడం సహజమే. అయినప్పటికీ ఓ కొత్త దర్శకుడిగా సిద్ధార్ద్ చేసిన ఈ తొలి ప్రయత్నం “భైరవగీత” ట్రైలర్ పాస్ మార్కులను వేయించుకుంది. అక్టోబర్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ ట్రైలర్ కు ప్లస్ పాయింట్ లలో ఒకటి హీరోయిన్ లుక్స్.