bettings on kodali nani and devineni avinashతొలి దశలోనే ఏపీ ఎన్నికలు నిర్వహించడంతో త్వరగా పూర్తి అయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా పోలింగ్‌కు, ఓట్ల లెక్కింపునకు సుదీర్ఘ విరామం వచ్చింది. దాదాపు 43 రోజులు ఉండడంతో పందేల జోరు ఊపందుకుంది. ఐపీఎల్ పోటీల కంటే ఎన్నికల బెట్టింగులకే ఎక్కువ డిమాండ్ ఉండటం విశేషం. కౌంటింగు తేదీ దగ్గర పడేకొద్దీ ఈ జోరు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పందేల మూలంగా మధ్యవర్తులు కూడా బానే బాగుపడుతున్నారు. రెండు వైపులా 10 శాతం చొప్పున కమీషన్‌ తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో బెట్టింగు పరంగా బాగా డిమాండ్ ఉన్న నియోజకవర్గం గుడివాడ. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోని వారిని కూడా ఎక్కువ ఆకర్షించింది ఈ నియోజకవర్గం. నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్క జిల్లాలకు, హైదరాబాద్‌కూ పాకాయి. కొడాలి నాని, దేవినేని అవినాష్‌ మధ్య నువ్వా, నేనా అన్న రీతిలో పోరు సాగింది. ఇరువర్గాలు డబ్బు కూడా ఏరులై పారింది. రెండు పార్టీలు పోటీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పని చేశాయి. ఎవరు గెలుస్తారు, ఎంత ఆధిక్యత వస్తుంది అనే దాని మీద బెట్టింగులు జరుగుతున్నాయి.

గతంలో ఇక్కడ కొడాలి నాని వరుసగా గెలుస్తుండడంతో పందాలకు పెద్దగా ఆస్కారం లేకపోవడం విశేషం. ఇప్పుడు రాష్ట్రంలోనే ఎక్కువగా ఈ నియోజకవర్గం మీదే పందాలు జరుగుతున్నాయి. వరుసగా మూడు సార్లు గెలిచినా మూడు సార్లూ ప్రతిపక్షంలో ఉండడంతో గుడివాడలో పెద్దగా అభివృద్ధి జరగలేదు. ఇది నానికి ప్రతికూల అంశంగా తయారయ్యింది. అయితే ఈ సారి గెలిస్తే తనకు జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిపదవి గారంటీ అని మరొక్కసారి అవకాశం ఇవ్వాలని నాని ప్రజలని అడిగారు. ప్రజల తీర్పు ఎలా ఉంది అనేది ఈ నెల 23న తెలుస్తుంది.