bethaludu-public-talk‘బిచ్చగాడు’ భారీ విజయం తర్వాత విడుదల కాబోతున్న సినిమాగా ‘భేతాళుడు’ భారీ ప్రచారాన్ని దక్కించుకుంది. దానికి తగిన విధంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. దీంతో మళ్ళీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘భేతాళుడు’ షాక్ ఇవ్వడం ఖాయమన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమయ్యింది. అలా అంచనాలు వేసిన వారికి నిజంగానే షాక్ ఇచ్చే విధంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ‘భేతాళుడు.’

ప్రమోషన్ లో భాగంగా ముందే విడుదల చేసిన మొదటి పది నిముషాల సినిమా ఎంతో ఆసక్తికరంగా సాగడంతో… ‘భేతాళుడు’పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఆ పది నిముషాలకు తోడు మరో 20 నిముషాలు… అంటే తొలి అర్ధగంట సినిమా ఆసక్తిగా సాగిందని, ఆ తర్వాత రానూ రానూ ప్రేక్షకులను నీరసపరిచే ప్రక్రియ జరిగిందని, ఇంటర్వెల్ కు కాస్త ట్విస్ట్ ఇచ్చినప్పటికీ, సెకండాఫ్ లో సినిమా పూర్తిగా గాడి తప్పి, ప్రేక్షకుల సహనాన్ని పరీక్ష పెట్టిందన్న టాక్ సర్వత్రా వినపడుతోంది.

దీంతో ‘భేతాళుడు’ సినిమా భయపెట్టిస్తుందని భావించి ధియేటర్ కు వెళితే, మరొక విధంగా భయపెట్టడంతో ప్రేక్షకులు అవాక్కవుతున్నారు. భారీ అంచనాలు పెట్టుకుంటే… ఎలాంటి సినిమా అయినా నిరుత్సాహపరచడం తప్పదన్న విషయం ‘భేతాళుడు’ కూడా నిరూపించిందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రతి సినిమాలోనూ కొత్తదనం కోసం పరితపించే విజయ్ అంటోనీ కృషి, ఫస్టాఫ్ లో కనిపించినప్పటికీ, సెకండాఫ్ లో అనుసరించిన రెగ్యులర్ ఫార్మాట్ తో విసుగు తెప్పించారనేది ఆడియన్స్ టాక్.